నాగ చైతన్య సాయి పల్లవితో ప్రేమలో పడ్డాడా?

నాగ చైతన్య, సమంతలు విడిపోయి అప్పుడే రెండేళ్ళు కావస్తోంది. ఇద్దరూ సినిమాలు చేసుకుంటున్నారు కానీ మళ్ళీ ప్రేమ, పెళ్ళి గురించి మాట్లాడటం లేదు. కానీ నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో చూస్తే నాగ చైతన్య, సాయి పల్లవితో ప్రేమలో పడి ఉండవచ్చనిపిస్తోంది. 

ఆ వీడియోలో నాగ చైతన్య సాయి పల్లవిని ఉద్దేశ్యించి “బుజ్జి తల్లీ వచ్చేతున్నా కాదే... కాస్త నవ్వే...” అంటూ బ్రతిమాలుకోగా, మొదట బుంగమూతి పెట్టిన ఆమె తర్వాత మూసిముసి నవ్వులు నవ్వింది. 

ఈ వీడియోని ప్రేమికుల దినోత్సవం రోజునే నాగ చైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆమెతో ప్రేమలో పడిన్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తాయని తెలిసి ఉన్నప్పటికీ పోస్ట్ చేశాడంటే అందరికీ తెలియాలనే కావచ్చు. 

ఇదివరకు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నారు. కనుక వాళ్ళిద్దరి లవ్ స్టోరీ మొదలయ్యే ఉండవచ్చు.