
డ్యాషింగ్ డైరక్టర్ పూరి ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పేశాడని అతని సినిమాల ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. రీసెంట్ గా వచ్చిన ఇజం కల్యాణ్ రామ్ ను డిఫరెంట్ గా చూపించడం వరకు ఓకే కాని సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం చతికిల పడ్డది. రిజల్ట్ గురించి పట్టించుకోకుండా తన తర్వాత సినిమా కథ సిద్ధం చేసే ప్రయత్నంలో బ్యాంకాక్ వెళ్లాడు పూరి.
ఇక ఈసారి తన పెన్ను మరింత పదును పెట్టి కథ రాస్తున్నాడట. అంతేకాదు తర్వాత సినిమా ఓ కుర్ర హీరోతో చేసే ప్లాన్లో ఉన్నాడట. కుదిరితే రామ్ గాని, నాగ శౌర్య కాని పూరి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరి స్టార్ హీరోల దగ్గర నుండి పూరి రేంజ్ కుర్ర హీరోలకు పడిపోయిందన్నమాట. తన సినిమాలో హీరోలను పవర్ఫుల్ గా చూపించే పూరి సినిమాలో మాత్రం ఆ పవర్ ఉండేలా జాగ్రత్త పడట్లేదు.
పూరి టార్గెట్ చేస్తున్న ఈ కుర్ర హీరోలతో అయినా హిట్టు కొడతాడో చూడాలి. పూరి ఫ్లాపుల్లో ఉన్నా సరే అతనితో సినిమా అంటే యువ హీరోలు ఎగబడతారు. మరి రామ్, నాగ శౌర్య ల పేర్లే వినబడుతున్నాయి స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక కాని ఎవరు ఫైనల్ హీరో అన్నది తెలుస్తుంది.