
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ సినిమాను ఓకే చేయలేదు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న డైరక్టర్స్ అందరితో చర్చలు జరుపుతున్నా ఏది ఫైనల్ చేయాలో తోచక కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పటాస్, సుప్రీం సినిమాలతో ఆడియెన్స్ ను మెప్పించిన డైరక్టర్ అనీల్ రావిపూడి చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చిందట. అందుకే అతన్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
వక్కంతం వంశీ, పూరి, త్రివిక్రం, చందు మొండేటి, చివరి వి.వి.వినాయక్ కూడా తారక్ తో సినిమా చేస్తున్నాడని అన్నారు. జనతా హిట్ తో మరింత భాధ్యత మీద వేసుకున్న తారక్ ఈసారి కూడా అదే రేంజ్ సినిమాతో రావాలని నిర్ణయించుకున్నాడు. అందుకే కథల విషయంలో నచ్చే కథ దొరికే దాకా వెతక సాగారు.
ఈమధ్యనే అనీల్ రావిపూడితో చర్చలు జరిపిన తారక్ కథ నచ్చడంతో డెవలప్ చేసుకు రమ్మని చెప్పినట్టు టాక్. ఒకవేళ పూర్తి కథ నచ్చేస్తే అనీల్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.