.jpeg)
త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కాంబినేషన్‌లో సంక్రాంతి పండుగకు విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమాకు మొదట నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని రూ.250 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతని ఒడ్డున పడేసింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరువు కూడా కాపాడింది.
గుంటూరు కారంలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు చేయగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్వయంగా ఈ విషయం తెలియజేస్తూ, “రౌడీ రమణని 70 ఎంఎం సినిమా స్కోప్‌లో చూశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. ఫిబ్రవరి 9 నుంచి గుంటూరు కారం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారం కాబోతోంది,” అని ట్వీట్ చేసింది.