కన్నప్ప దసరాకి... రాగలడా?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న ‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌ న్యూజిలాండ్‌లో ఏకధాటిగా రెండు నెలలకు పైగా జరిగింది. అక్కడ షూటింగ్‌ పూర్తిచేసుకుని ఇటీవలే అందరూ హైదరాబాద్‌ తిరిగి వచ్చారు.

ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడిగా నటించబోతున్నారు. మలయాళ నటుడు మోహన్ లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కనుక ఇప్పుడు వీరు ముగ్గురూ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో విష్ణుకి జోడీగా బాలీవుడ్‌ నటి కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ నటిస్తోంది. 

స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ కన్నప్ప సినిమాకు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  

కన్నప్ప సినిమా షూటింగ్‌ చాలా వరకు న్యూజిలాండ్‌లోనే పూర్తయింది కనుక మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి,   ఈ ఏడాది దసరా పండుగకు విడుదల చేయాలని మంచు విష్ణు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ జూ.ఎన్టీఆర్‌ నటిస్తున్న దేవర ఏప్రిల్‌కు 5న విడుదల కావలసి ఉండగా ఆలస్యం కావచ్చని, దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రామ్ చరణ్‌ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్‌ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కనుక కన్నప్ప కాస్త ముందో వెనకో రాక తప్పదేమో?  

ఈ సినిమాని దక్షిణాది భాషలతో సహా హిందీలో కూడా విడుదల చేస్తున్నందున, త్వరలోనే దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మిస్తున్నారు. 

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.