
మెగాస్టార్ చిరంజీవి-వశిష్ట కాంబినేషన్‌లో మెగా 156వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సెట్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్టారంటూ యూవీ క్రియెషన్స్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా చిరంజీవిని డార్క్ మోడ్‌లో చూపిస్తూ ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది.
దసరా పండుగ రోజున పాటల రికార్డింగ్ కార్యక్రమంతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ఆరు పాటలుంటాయని సంగీతం సమకూరుస్తున్న ఎంఎం కీరవాణి తెలిపారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో తీస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మృణాళిని ఠాకూర్ నటించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.
ఈ సినిమా కోసం చిరంజీవి జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఈ వీడియోని ఇటీవలే విడుదల చేయగా వైరల్ అయ్యింది.