ఊరి పేరు భైరవ కోన రిలీజ్... మళ్ళీ వాయిదా!

సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్‌లో సంక్రాంతికి రావాలనుకున్న ‘ఊరు పేరు ‘భైరవకోన’ ఫిబ్రవరి 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఆరోజున నాలుగైదు సినిమాలు ఉండటంతో వాయిదా పడింది.

అయితే మళ్ళీ ఫిబ్రవరి 9న రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా కూడా విడుదల కాబోతోంది. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నందుకు ‘ఈగల్‌’కు మరో సినిమా నుంచి పోటీ లేకుండా చూస్తామని నిర్మాతల మండలి హామీ ఇచ్చింది.

ఆ ప్రకారమే సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 9కి మారిన సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘టిల్లూ స్క్వేర్’ని మార్చి 29కి వాయిదా వేయించింది. అయితే ఈసారి తాము వెనక్కు తగ్గబోమని సందీప్ కిషన్, దర్శకుడు విఐ ఆనంద్ ఇద్దరూ చెప్పిన్నప్పటికీ,’ నిర్మాతల మండలి నిన్న నిర్మాత రాజేష్ దండాతో మాట్లాడి ‘ఊరు పేరూ భైరవకోన’ సినిమాని వాయిదా వేసుకునేందుకు ఒప్పించింది. కనుక ఈ సినిమా ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేసుకోవాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు దీనిపై అప్‌డేట్ ఇస్తామని , ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్‌ చేసింది.