మహాభారతంలో ఆ పాయింట్ స్ఫూర్తిగా హ్యాపీ ఎండింగ్!

రామాయణ, మహాభారతాలు ఎందరికో స్పూర్తినిస్తూనే ఉన్నాయి. నేటికీ వాటి నుంచి అనేక కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. అటువంటిదే తమ ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా కూడా అని దర్శకుడు కౌశిక్ భీమిడి చెప్పారు. యష్ పురి, అపూర్వరావు జోడీగా తెరకెక్కించిన ఈ సినిమాకు మహాభారతంలోని శాపాలే స్పూర్తి అని కౌశిక్ భీమిడి చెప్పారు. వాటి గురించి చదివినప్పుడు, ఇప్పుడు వాటిని ఓ యువకుడికి ఆపాదించి సినిమాగా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఈ కధ స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నానని చెప్పారు. 

అయితే ఇది ఓ రొమాంటిక్ డ్రామాగా తీశామని, దీనిలో శాపగ్రస్తుడైన ఓ యువకుడు ప్రేమను దక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎలా విఫలమవుతుంటాయనేది ఈ సినిమా కధ. అతని ప్రేమ కధ ట్రాజెడీయే, కానీ ప్రేక్షకులకు మంచి కామెడీ పంచుతుంది.

 నాకు శేఖర్ కమ్ముల, కె విశ్వనాధ్ అభిమాన దర్శకులు. వారి సినిమాలలో లేడీ క్యారక్టర్స్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే మా ఈ హ్యాపీ ఎండింగ్ సినిమాలో కూడా లేడీ క్యారక్టర్స్‌కు చాలా ప్రాముఖ్యత ఉండేలా పాత్రలను డిజైన్ చేసుకున్నాను,” అని దర్శకుడు కౌశిక్ భీమిడి చెప్పారు. 

ఇటీవల విడుదల చేసిన దీని ట్రైలర్‌ని చూసినప్పుడు ఈ సినిమాలో కామెడీ మాత్రమే కాదు... కాస్త అడల్ట్ కంటెంట్, డైలాగులు కూడా ఉంటాయని అర్దమవుతోంది. 

హ్యామ్స్ టెక్ ఫిలిమ్స్, సిల్లీ మాంక్స్ బ్యానర్లపై యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల కలిసి నిర్మించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్: నాగ సాయి, సంగీతం: రాష్ట్రవ్యాప్తంగా నిడమర్తి, కెమెరా: అశోక్ సీపల్లి, ఎడిటింగ్: ప్రదీప్ ఆర్. మోరం చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కాబోతోంది.