గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి కొత్త సినిమా

నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను ఇద్దరూ మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత కలిసి మరో సినిమా తీసేందుకు సిద్దమవుతున్నారు. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గీతా ఆర్ట్స్ ఈ విషయం తెలియజేస్తూ వారిద్దరి ఫోటో పెట్టింది. 

మాస్ డైరెక్టర్‌గా పేరున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే అల్లు అర్జున్‌ హీరోగా ‘సరైనోడు’ సినిమా తీశారు. ఆ సినిమాతో అల్లు అర్జున్‌కి మాస్ ఇమేజ్‌ మరింత పెరిగింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి బారీగా కలెక్షన్స్ సాధించింది. కనుక మళ్ళీ వారి కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో అల్లు అరవింద్, బోయపాటి శ్రీను కొత్త సినిమా ప్రకటన చేసినందున, ఇది అల్లు అర్జున్‌ కోసమే కావచ్చు. పుష్ప-2 షూటింగ్‌ పూర్తికాగానే అల్లు అర్జున్‌ ఈ సినిమాను మొదలుపెట్టవచ్చు. ఈ సినిమాకి హీరో ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నారు.