నితిన్ రాబిన్‌హుడ్ టైటిల్‌ గ్లిమ్స్‌... వెరైటీగా ఉందే!

ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్‌, ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు. సినిమాకి రాబిన్‌హుడ్ అని టైటిల్‌ పెట్టారు. రాబిన్‌హుడ్ స్టోరీ చదివినవారికి టైటిల్‌ను బట్టి ఈ సినిమా కధ ఏమిటో అర్దమవుతుంది. తెలియనివారుంటే, టైటిల్‌ గ్లిమ్స్‌లో నితిన్ వాయిస్ ఓవర్‌తో కధ చెప్పేశారు. 

“దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్ళు అందరూ నా అన్నదమ్ములు... ఆభరణాలు వేసుకున్నవారందరూ నా అక్కచెల్లెళ్ళు. అవసరమని వారి జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నామీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవలేదు. ఎందుకంటే అయినవాళ్ళ దగ్గర తీసుకోవడం నా హక్కు. మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్‌ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్...” అంటూ నితిన్ వాయిస్ ఓవర్‌తో చెప్పిన డైలాగ్స్, మారువేషాలలో డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకువెళుతున్న సీన్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. 

ఈ సినిమాకి మొదట రష్మిక మందనను అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో శ్రీలీలని తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ ఆమె కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఇప్పుడు మరో హీరోయిన్‌ కోసం వెతుకుతున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి రామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు.