టిల్లు స్క్వేర్ మళ్ళీ వాయిదా... ఈసారి మార్చి 29కి

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జోడీగా ఫిబ్రవరి 9న విడుదల కావలసిన టిల్లు స్క్వేర్ సినిమా మరోసారి వాయిదా పడింది. సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలవుతుండటంతో ఫిబ్రవరి 9కి వాయిదా వేసుకుంటే, ఇప్పుడు కూడా ఈగల్, ఊరిపేరు భైరవకోన, ప్రస్థానం-2 సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో మార్చి 29వ తేదీకి వాయిదా పడింది. సినిమా రిలీజ్ వాయిదా వేసిన్నట్లు ‘టిల్లు స్క్వేర్’ టీం తెలియజేసింది. 

సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ‘డిజే టిల్లు’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ తీశారు. కానీ దీనిలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అనుపమ చాలా రెచ్చిపోయి హాట్ హాట్‌గా నటించిన్నట్లు ఫస్ట్-లుక్ పోస్ట ర్స్‌లో కనిపిస్తోంది. 

ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం శ్రీచరణ్ పరకాల, రామ్ మిర్యాల, కెమెరా: ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగ వక్కంతం వంశీ, సాయి సౌజన్య కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్టూన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. మార్చి 29కి టిల్లు స్క్వేర్ వాయిదా వేసుకున్నప్పటికీ సరిగ్గా అదే సమయంలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. కనుక మళ్ళీ మరోసారి వాయిదా వేసుకోక తప్పదేమో?