నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్... నేటి అర్దరాత్రి నుంచే

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూ.100కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ‘యానిమల్’ డిసెంబర్‌ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.900 కోట్లు కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది.

బాలీవుడ్‌ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన ఈ సినిమాలో జంటగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో బుధవారం అర్దరాత్రి విడుదల కాబోతోంది. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, సురేష్ ఒబిరాయ్, సౌరబ్ సచ్‌దేవ, తృప్తి డిమ్రీ, ఉపేంద్ర లిమాయే ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకు  సచేత్-పరంపర, మిథున్, అమాల్ మాలిక్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్ సంగీతం, అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. నేటి అర్దరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం కాబోతోంది.