అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్‌ వచ్చేసిందిగా

తెలుగు సినీ పరిశ్రమని, ప్రేక్షకులని చిన్న సినిమాలు మురిపిస్తున్న ఈవేళలో మరో చిన్న లోకల్ సినిమా,  ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫిబ్రవరి 2న వచ్చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని అంబాజీపేటలో జరిగే ఓ ప్రేమ కధతో ఈ సినిమా సిద్దం అవుతోంది. 

దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సుహాస్, శివాని జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సుహాస్ పాత్ర పేరు మల్లిగాడు. అతను ఓ సెలూన్‌లో పనిచేస్తూ మ్యారేజ్ బ్యాండ్ మేళంలో వాయిద్యకారుడుగా పనిచేస్తుంటాడు.

ఊళ్ళో అమ్మాయితో మల్లిగాడి  ప్రేమ, ఆ ప్రేమలో కాస్త కామెడీ, కాస్త రొమాన్స్, ఊళ్ళో గొడవలు, భావోద్వేగాలు అన్నీ ఈరోజు విడుదల చేసిన ట్రైలర్‌లో చూపించేశారు.

అయితే ఇప్పటి వరకు చూసిన ఫస్ట్-లుక్ పోస్టర్‌,  టీజర్‌, పాటలు చూసినప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి రొమాంటిక్ కామెడీ అనుకుంటే, ట్రైలర్‌ కాస్త సీరియస్ సినిమాయే అని సూచిస్తున్నట్లుంది.