1.jpeg)
కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, జాహ్నవి జంటగా దేవర సినిమా ఏప్రిల్ 5వ తేదీకి విడుదల కాబోతోంది. కానీ ఇంచు మించు అదే సమయంలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఈ విషయం కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా చూచాయగా చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రజల దృష్టి వాటిపైనే ఉంటుంది తప్ప సినిమాలపై పెద్దగా ఉండదు.
కేంద్ర ఎన్నికల కమీషన్ చెపుతున్నట్లు ఏప్రిల్ 16కి కాస్త ముందూ వెనుకగా ఎన్నికలు మొదలైనా, రెండు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం నెలకొని ఉంటుంది. కనుక రాజకీయ కోలాహలం నెలకొని ఉన్నవేళ దేవర వంటి పెద్ద సినిమాని విడుదల చేయాలనుకోవడం చాలా సాహసమే అవుతుందని చెప్పవచ్చు.
కనుక దేవర సినిమాని ఆగస్ట్ 15వ తేదీకి వాయిదా వేసుకోవాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
దేవర రిలీజ్ డేట్‌పై ఇప్పటికే పలుమార్లు ఊహాగానాలు వినిపించగానే వాటిని దేవర టీమ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కనుక ఎన్నికల నేపధ్యంలో దేవరని వాయిదా వేసుకుంటారా లేక తెగించి రిలీజ్ చేస్తారా? అనేది త్వరలోనే తెలియవచ్చు.