అప్పుడు హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు సైతం మనచుట్టూ తిరుగుతారు!

హనుమాన్‌ సినిమాతో రికార్డ్స్ బద్దలు కొడుతున్న యువ దర్శకుడు, మొన్న సోమవారం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తన తదుపరి సినిమా ‘జై హనుమాన్‌’ అని ప్రకటించాడు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించిన్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇంతవరకు మన భారతీయ సినిమాలు హాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూటర్లను వెతుకునే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ మన సినిమాల రిలీజ్ కోసం ముందుగా ఏవిదంగా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని ఒప్పందాలు చేసుకుంటామో, మున్ముందు హాలీవుడ్‌ డిస్ట్రిబ్యూటర్లే మన సినిమాల కోసం మన చుట్టూ తిరిగే రోజు ఎంతో దూరం లేదు. మన భారతీయ సినిమాలను ఆ స్థాయికి తీసుకుపోవడంలో నా వంతు కృషి నేను చేస్తాను,” అని ప్రశాంత్ వర్మ చెప్పారు. 

హనుమాన్‌ సినిమాకి ఉత్తరాది రాష్ట్రాలలో అలాగే విదేశాలలో కూడా అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. కనుక ఇప్పుడు ఈ సినిమాను విదేశీ భాషలలో కూడా డబ్ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.