
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో చిత్ర పరిశ్రమకి తన సత్తాచాటి చూపాడు. కేవలం రూ.45 కోట్ల బడ్జెట్‌తో హనుమాన్ సినిమాని అద్భుతంగా తీసి ప్రేక్షకులను మెప్పించాడు. సంక్రాంతి పండుగ బరిలో పెద్ద సినిమాలతో పోటీ పది నిలబడటమే కాకుండా పది రోజుల్లో రూ.200 కోట్లు కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు.
ప్రశాంత్ వర్మ తన తర్వాత సినిమా పేరు ‘జై హనుమాన్’ అని ప్రకటించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్దమైందని తెలియజేస్తూ ‘జై శ్రీరామ్’ అని వ్రాసున్న స్క్రిప్ట్ పుస్తకం హనుమంతుడి విగ్రహం ముందు పెడుతూ ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
నిన్న అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ ప్రకటన చేస్తూ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలియజేశాడు. ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో ఆంజనేయ స్వామి పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి వివరాలు వెల్లడించనున్నారు.