నానికి సరిపోదా శనివారం?

నాచురల్ స్టార్ నాని, కోలీవుడ్‌ సూపర్ స్టార్ ఎస్‌జె.సూర్య ప్రధాన పాత్రలలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వివేక్‌ ఆత్రేయ దదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్, సాయి కుమార్‌ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ దక్కించుకుందని ఈరోజే ట్విట్టర్‌లో తెలియజేశారు.

హైనాన్న వంటి చక్కటి ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నాని, ఇప్పుడు యాక్షన్-డ్రామా జోనర్‌లో సినిమా చేస్తుండటం విశేషమే. పోస్టర్ కూడా చాలా ఆకట్టుకునేలా ఉంది. 

ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి.మురళి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు. ఈ సినిమాకి అక్టోబర్ 24వ తేదీన పూజా కార్యక్రమాలు చేసి రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. కనుక ఈ వేసవి సెలవులలో లేదా దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిలో కోలీవుడ్‌ హీరో సూర్యా కూడా ఉన్నందున ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయవచ్చు.