వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్ళి కబుర్లు పూర్తయ్యాయి కనుక ఇప్పుడు వారి సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ‘మట్కా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ గ్యాంబ్లర్‌గా నటిస్తున్నాడు. 1958-82 మద్య కాలంలో విశాఖ కేంద్రంగా జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
ఇవాళ్ళ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా 'ఓపెనింగ్ బ్రాకెట్' అంటూ ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. దానిని బట్టి ఇది ఓ పీరియాడికల్ క్రైమ్ సినిమా అని అర్దమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ చేస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపీ, రూపాక్షి, విజయరామ రాజు, జగదీష్, రాజ్ తిరాందాస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్న ‘మట్కా’ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజేందర్ రెడ్డి, రజని తాళ్ళూరి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: కరుణ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్, కెమెరా: కిషోర్ కుమార్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.