ఎన్నడూ లేనివిదంగా ఈసారి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమా అని తేలికగా తీసిపడేసిన హనుమాన్ సూపర్ హిట్ అయితే, పెద్ద సినిమా అనుకున్న గుంటూరు కారం మిశ్రమ స్పందనతో భారంగా ముందుకు సాగుతోంది.
గుంటూరు కారం సినిమా కోసం చిన్న సినిమా హనుమాన్‌కు మొదటిరోజు సరిపడా థియేటర్లు కేటాయించకపోవడంతో అందరి దృష్టి ఈ వివాదంపైనే ఉంది.
దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ, “ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు ఎవడన్నా, పక్కోడి అపజయానికి సోలో డాన్స్ ఏస్తే, రేపు వాడి, అపజయానికి గ్రూప్ డాన్సర్లు….. రెడీ అవుతారు…..” అని ట్వీట్ చేశారు.
అయితే ప్రతీ రంగంలోను ఈర్ష్యాద్వేషాలు, కక్షలు, ముసుగులో గుద్దులాటలు తప్పక ఉంటాయి. లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన తెలుగు సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపు కాదు. ఈ విషయం మా ఎన్నికల సమయంలో బయటపడుతూనే ఉంటుంది కూడా.
కానీ హరీష్ శంకర్ చెప్పిన్నట్లుగా, “పక్కోడి అపజయానికి సోలో డాన్స్ ఏస్తే, రేపు వాడి, అపజయానికి గ్రూప్ డాన్సర్లు….. రెడీ అవుతారనేది నూటికి నూరు శాతం నిజమే.