సుహాస్, శివాని జంటగా నటిస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది. అయితే కాస్త వెరైటీగా చెప్పింది.
శ్రీకాకుళం జిల్లాలోని అంబాజీపేటలో మల్లిఖార్జున సెలూన్ షాపులో బార్బర్ పనిచేస్తుంటాడు మన హీరో మల్లిగాడు. దాంతోపాటు శుభకార్యాలకు బ్యాండ్ మేళంలో వాయిద్యకారుడుగా పనిచేస్తుంటాడు.
సెలూన్ తలుపులపై మహేష్ బాబు ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్ ఫోటోలు, వాటి ముందు నిలబడి మన హీరో కత్తెర పట్టుకొని స్టయిల్‌గా నిలబడిన ఫోజు ఇస్తున్న ఫోటోతో ఉన్న పోస్టర్ విడుదల చేశారు.
“పండక్కి ఊర్లో అందరూ సందడి సేసేయండి తరువాత మా అంబాజిపేటోళ్లు థియేటర్ లో సందడి సేసేస్తారు,” అంటూ జీఏ2 పిక్చర్స్ ట్వీట్ చేసింది.
అంబాజీపేటలో జరిగే కధతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు దుష్యంత్ కటికనేని. ఈ సినిమాలో మంచి కామెడీ, రొమాన్స్ రెండూ ఉంటాయని ఆశించవచ్చు.