
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతి 2017 సంక్రాంతి పండుగకు రిలీజ్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన చక్కటి కుటుంబ కధా చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. దానిని కూడా శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించబోతున్నారు.
నిజానికి శతమానం భవతికి సీక్వెల్ తీయాలని దిల్‌రాజు అప్పుడే అనుకున్నారు. కానీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తీయబోతున్నారు. నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా పేరు ‘శతమానం భవతి నెక్ట్స్ పేజ్.’ దీనిని 2025 సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నట్లు శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నట్లు నిన్ననే ప్రకటించారు.
అలాగే ఇకపై ఏటా సంక్రాంతి పండుగకు తప్పకుండా ఒక సినిమా విడుదల చేస్తుంటానని హనుమాన్కు దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు.
ఇప్పుడు దిల్ రాజు సినిమా శతమానం భవతి నెక్ట్స్ పేజ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది.
అంటే వచ్చే సంక్రాంతి పండుగకు అప్పుడే మూడు సినిమాలు పోటీకి సిద్దమవుతున్నాయన్న మాట! ఇంకా మరెన్ని సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతాయో చూడాలి.