చిరంజీవి అభిమానులకు విశ్వంభర సంక్రాంతి కానుక

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సంక్రాంతి కానుకగా విశ్వంభర సినిమా కాన్సెప్ట్ వీడియోని సోమవారం విడుదల చేశారు. కళ్యాణ్ రామ్‌కు బింబిసార వంటి సూపర్ హిట్ అందించిన మల్లాది వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా చేసి చాలా ఏళ్ళే అవుతోంది. మళ్ళీ మరోసారి చిరంజీవి విశ్వరూపం చూపించబోతున్నామని దర్శకుడు వశిష్ట చెప్పారు.

గత ఏడాది దసరా పండుగనాడు లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మృణాళిని ఠాకూర్‌, అనుష్క శెట్టి నటిస్తున్నట్లు సమాచారం.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.