
ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు అందరికీ తెలుసు కానీ దాని గురించి ఒక్క చిన్న అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడంతో అసలు ఆ సినిమా ఇంకా సాగుతోందో లేదో కూడా తెలీని పరిస్థితి. అయితే సంక్రాంతి రోజున సూర్యోదయంతో పాటు రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఈ సినిమాని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. జనవరి 15వ తేదీ ఉదయం 7.08 గంటలకు ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్, టైటిల్ రెండు ప్రకటిస్తామని తెలియజేసింది.
సలార్ సినిమా హిట్ అవడంతో చాలా సంతోషంగా ఉన్న ప్రభాస్ అభిమానులకు దర్శకుడు మారుతి ప్రకటించిన ఈ సంక్రాంతి పండుగ డబుల్ గిఫ్ట్ తో నిజంగా పండగే. ఈ సినిమా పేరు ‘రాజా డీలక్స్’ అని ప్రచారంలో ఉన్నప్పటికీ అసలు పేరు సంక్రాంతి రోజునే తెలుస్తుంది.