
ఒకప్పుడు దసరా బుల్లోడుగా అక్కినేని నాగేశ్వరరావు నిలిస్తే అక్కినేని నాగార్జున నా సామిరంగా అంటూ సంక్రాంతి పండుగకు వచ్చేస్తున్నారు. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాధ్, మిర్ణా మేనన్, రుష్కర్ ధిల్లాన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా రిలీజ్ చేయాలని ముందే టార్గెట్ పెట్టుకొని సినిమా తీసినందున ట్రైలర్లో సంక్రాంతి పండుగని తెచ్చి మన ముందు పెట్టేశారు.
ట్రైలర్లో నాగార్జున మార్క్ చిలిపి డైలాగ్స్, రొమాన్స్, స్టయిల్, ఫైట్స్ వగైరాలన్నీ అన్నీ దట్టించేశారు. కనుక నా సామి రంగా... సంక్రాంతికి మంచి విందు భోజనమే పెట్టబోతున్నాడు!
ఈ సినిమాకు సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: చంద్ర బోస్, ఎంఎం. కీరవాణి, కెమెరా: శివేంద్ర దాశరధి, ఫైట్స్: రామ్- లక్ష్మణ్, వెంకట్, పృధ్వీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీని బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.