
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కథ నచ్చినా చేసే వీలు లేకపోవడంతో ఆ కథతో ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మూవీ చేస్తున్నాడు. ఇంతకీ మహేష్ నచ్చిన ఏ కథను వరుణ్ తేజ్ చేస్తున్నాడు అంటే శేఖర్ కమ్ముల డైరక్షన్లో రాబోతున్న ఫిదా అని తెలుస్తుంది. లీడర్ తర్వాత స్టార్ హీరోలకు కథలు సిద్ధం చేసే ప్రయత్నం చేసిన శేఖర్ కమ్ముల ఒకానొక దశలో మహేష్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.
అయితే మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేయడం దాన్ని మహేష్ నచ్చడం అంతా జరిగిపోయింది. ఈలోగా కహాని రీమేక్ గా తెలుగు తమిళంలో తీసిన అనామిక ఫ్లాప్ అవడంతో కమ్ముల కాస్త బ్యాక్ అయ్యాడు. ఇక మహేష్ కూడా పూర్తి క్లాస్ మూవీగా తీసిన బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవడంతో కమ్ముల సినిమా మీద కూడా డెశిషన్ మార్చుకున్నాడు.
సో వరుణ్ తేజ్ చేసే ఫిదా మూవీ మహేష్ చేయాల్సిందన్నమాట. మలయాళ ప్రేమం బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది ఇక ఇప్పుడు మహేష్ నచ్చిన కథ అనగానే ఇంకాస్త బజ్ ఏర్పడుతుంది. మరి కెరియర్ లో సూపర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఫిదాతో ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తాడో లేదో చూడాలి.