
వక్కంతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా చేసిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ జనవరి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలై నెగెటివ్ టాక్ రావడంతో ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించినందుకు నితిన్ తీవ్రంగా నష్టపోయారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు, సినిమాకి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ గొప్ప బిల్డప్ ఇచ్చినప్పటికీ దర్శకుడు వక్కంతం వంశీ కధని తెరకెక్కించలేకపోవడం, హారిస్ జయరాజ్ సంగీతం ఆకట్టుకోలేకపోవడం వలన సినిమా నెగెటివ్ టాక్ వచ్చింది.
ముఖ్యంగా హై నాన్న, యానిమల్ సినిమాలతో పోటీ పడలేక వాటి ముందు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తలదించుకోక తప్పలేదు.
ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతోంది. సినిమా ఏమాత్రం బాగున్నా ఓటీటీ ప్రేక్షకులు ఓపికగా చూసేస్తారు కనుక ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వారినైనా మెప్పిస్తాడో లేదో?