గీతాంజలి మళ్ళీ వచ్చింది... ఫస్ట్ గ్లిమ్స్‌

ఒకప్పుడు హాస్యనటుడుగా అందరినీ అలరించిన సునీల్ గత కొన్నేళ్ళుగా సీరియస్ రోల్స్, విలన్‌గా కూడా చేస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే సినిమాలో కిల్లర్ నాని పాత్ర చేస్తున్నారు. తెలుగు దర్శక నిర్మాతలు మరిచిపోయిన అంజలి ,  ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆమెకు ఇది 50వ సినిమా. నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో సిద్దమవుతున్న ఈ సినిమా ఓ సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని ఫస్ట్-లుక్ పోస్టర్‌, ఫస్ట్ గ్లిమ్స్‌ స్పష్టం చెప్పేశాయి. ఈ సినిమాలో అలీ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్యా, షకలక శంకర్, రాష్ట్రవ్యాప్తంగా శంకర్, రాహుల్ మాధవ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కధ: కోన వెంకట్, భాను బొగ్గగరపు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సుహత సిద్దార్ధ, ఎడిటింగ్: చోట కె ప్రసాద్ చేస్తున్నారు. సినీ కధా రచయితగా మంచి పేరు సంపాదించుకొన్న కోన వెంకట్ నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎంవీవీ సినిమాస్‌తో కలిసి తన కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.