
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో వచ్చిన సలార్-1 సీజ్ ఫైర్ సూపర్ హిట్ అవడంతో అభిమానులు పండుగ చేసుకొంటున్నారు. సలార్‌కి సీక్వెల్ ఉంటుందని ముందే ప్రకటించినందున దానికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ స్వయంగా వారిని సంతోషపరిచే విషయం చెప్పారు. “సలార్-2 సినిమా కధ సిద్దంగా ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి 12-15 నెలల్లో పూర్తిచేసి ఎట్టి పరిస్థితులలో 2025లో విడుదల చేయాలనుకొంటున్నాము.
‘సలార్ సీజ్ ఫైర్’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చినందున, సలార్-2 ఇంకా గొప్పగా తీసి అందరినీ అలరించాలని అనుకొంటున్నాము. ప్రేక్షకులను అలరించే కధలతో సినిమాలు చేయడమే తప్ప ప్రత్యేకంగా ఎటువంటి ఫార్ములాని నేను ఫాలో అవడం లేదు. కనుక వేర్వేరు జోనర్లలో సినిమాలు చేస్తున్నాను,” అని అన్నారు.
సలార్ సినిమాని సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ సలార్-2ని దానికి రెట్టింపు బడ్జెట్‌తో తీయబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ నిర్మాత నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాతో మాట్లాడుతూ, “సలార్-సీజ్ ఫైర్’ సలార్-2కి చిన్న గ్లింప్స్ మాత్రమే. సలార్-2 హాలీవుడ్ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కంటే గొప్పగా ఉంటుంది,” అని చెప్పారు.