
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన గోపీచంద్‌కి చాలా ఏళ్ళుగా సరైన హిట్ రాకపోవడంతో రేసులో వెనకబడి పోయాడు. అయితే ఎలాగైనా ఓ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్న గోపీచంద్ ఈసారి కన్నడ దర్శకుడు హర్షతో కలిసి భీమా అనే మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నాడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌కి జోడీగా మాళవిక శర్మ, భవానీ శంకర్ నటిస్తున్నారు.
భీమా టీజర్ శుక్రవారం మధ్యాహ్నం 1.11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ, ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, కొరియోగ్రఫీ: డాక్టర్ రవివర్మ, కెమెరా: స్వామి జె గౌడ, స్టంట్స్: రామ్-లక్ష్మణ్ చేస్తున్నారు.