
ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విక్టరీ వెంకటేష్ ప్రధానపాత్ర చేసిన ‘సైంధవ్’ సినిమా విడుదల కాబోతోంది. కనుక సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దానిలో యాక్షన్ సీన్స్ చూస్తే దర్శకుడు శైలేష్ కొలను ముద్ర స్పష్టంగా కనబడుతోంది. “షర్ట్ వేసుకొన్న ప్రతీవాడికి కాలర్ ఉంటుందిరా... కానీ ఆ కాలర్ ఎవరి మెడ మీద ఉందో తెలుసుకొని దానికో రెస్పెక్ట్ ఇవ్వాలి” వంటి వెంకటేష్ డైలాగ్స్ బాగున్నాయి.
అరుదైన నరాల వ్యాధితో చనిపోబోతున్న కూతురు ప్రాణం కాపాడటం కోసం రూ.17 కోట్లు విలువ చేసే ఇంజక్షన్ అవసరం. దాని కోసం వెంకటేష్ ఎటువంటి సాహసాలు చేశాడనేదే ఈ సినిమా కధ అని ట్రైలర్‌తో చెప్పేశారు.
తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌తో నాని సినిమా హైనాన్న ఇటీవలే వచ్చింది. దానిని రొమాంటిక్ యాంగిల్లో తెరకెక్కించగా, సైంధవ్ సినిమాలో తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌ని శైలేష్ కొలను యాక్షన్ యాంగిల్లో తెరకెక్కించారు.
ఈ సినిమాలో వెంకటేష్, బేబీ ప్రధాన పాత్రలు చేయగా సారా పాలేకర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ద శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జర్మియా ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బిహెచ్ చేశారు.
నీహారికా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి సైంధవ్ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.