ఆ విలన్ హీరో అవుతున్నాడు..!

హీరోలు విలన్ లుగా మారుతున్న ఈ తరుణంలో ఓ విలన్ హీరోగా మారి అందరికి షాక్ ఇస్తున్నాడు. ఇంతకీ విలన్ నుండి హీరోగా మారుతున్నది ఎవరు అంటే కబీర్ దుల్హన్ సింగ్ అని తెలుస్తుంది. గోపిచంద్ జిల్ సినిమాతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కబీర్ అనతి కాలంలోనే స్టార్ హీరోలందరికి విలన్ గా చేశాడు. అయితే ప్రస్తుతం హెబ్భా పటేల్ ఏంజెల్ సినిమాలో ఓ పాజిటివ్ రోల్ చేస్తున్న కబీర్ విలన్ గా కన్నా ఈ సపోర్టింగ్ రోల్ చాలా బాగుందని అంటున్నాడు.

ఇక అదే క్రేజ్ తో తను హీరోగా కూడా ఛాన్స్ పట్టేశాడు. అశ్విన్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు మేల్ లీడ్ గా కబీర్ ను తీసుకున్నారట. ముందు విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన నటులలో ఇప్పుడు ఈ హింది నటుడు కూడా చేరుతున్నాడు. మరి కబీర్ చేసే హీరో వేశం కనుక క్లిక్ అయితే అతనికి అలాంటి ఆఫర్లే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. 

ఇండస్ట్రీలో అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి ఆ విషయంలో ఇప్పుడు కబీర్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. మరి మంచి జోష్ లో ఉన్న కబీర్ సింగ్ కెరియర్ ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి.