
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీస్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా దువ్వాడ జగన్నాథం అదేనండి డిజె.. లాస్ట్ మంథ్ ముహుర్తం పెట్టుకుని హీరో లేకుండా కొద్ది పాటి షూట్ చేసిన చిత్రయూనిట్ రేపటి నుండి బన్నితో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారట. ఈ సమ్మర్ లో సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బన్ని కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ డిజె షూట్లో పాల్గొంటున్నాడు.
పూజ హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్ని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ ఇమేజ్ కు తగ్గ స్టోరీతో హిట్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా బన్ని కెరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2017 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మెగా హీరోలతో మెమరబుల్ హిట్ కొట్టే హరీష్ శంకర్ ఈసారి బన్నితో తీస్తున్న డిజె ఎలాంటి సంచలన విజయం అందుకుంటుందో చూడాలి.
స్టార్ సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. అందుకే పూర్తి స్క్రిప్ట్ తో పకడ్బందీ ప్లాన్ తో ఈ సినిమా జరిగేలా ప్లాన్ చేశాడట బన్ని. అందుకే సినిమా తను లేని షెడ్యూల్ ముదుగా మొదలు పెట్టారట. మరి రేపటి నుండి రేసులో దిగుతున్న బన్నిని ఇక ఆపేవారే లేరని చెప్పొచ్చు.