గోపీచంద్-వైట్ల సినిమా టైటిల్‌ విశ్వం?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న చిన్నహీరోలు, చిన్న దర్శకులు కూడా హిట్స్ కొడుతున్నారు. కానీ    గతంలో అనేక హిట్స్ అందించిన హీరో గోపీ చంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఎందుకో చాలా వెనకబడిపోయారు. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై దోనేపూడి వేణు నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ గోపీ చంద్‌కు జోడీగా నటిస్తోంది. నాలుగు నెలల క్రితం అంటే సెప్టెంబర్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించారు.   

ప్రస్తుతం ఇటలీలోనిమిలాన్ నగరంలో ఈ సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్ పూర్తయింది. అక్కడ హీరోహీరోయిన్లపై ఓ సాంగ్, కొన్ని క్లైమాక్స్ ఫైటింగ్ సీన్స్ షూట్ చేసిన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఈ సినిమాకి టైటిల్‌ ప్రకటించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం విశ్వం అనే పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌, టైటిల్‌ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. 2024 వేసవి సెలవులలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.