
సమంత ఓ మ్యూజిక్ డైరక్టర్ ను కిడ్నాప్ చేస్తుందట. ఇది ఆమె ఎవరితోనో కాదు డైరెక్ట్ గా ఆ మ్యూజిక్ డైరక్టర్ తోనే సభాముఖంగానే అన్నది. ఇంతకీ సమంత కిడ్నాప్ చేద్దామనుకున్న మ్యూజిక్ డైరక్టర్ ఎవరు.. అసలు ఎందుకు అతన్ని కిడ్నాప్ చేయాలనుకుంది అంటే.. కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న కుర్ర మ్యూజిక్ డైరక్టర్ అనిరుథ్ ఇప్పటికే తెలుగులో రెండు భారీ సినిమాల అవకాశాలు వచ్చినా కాలదన్నుకున్నాడు. అఆ సినిమాకు అయితే అనిరుథ్ రాక కోసం చూసి చూసి చివరకు మిక్కి జే మేయర్ తో కానిచ్చేశారు.
రీసెంట్ గా రెమో తెలుగు ఆడియో కార్యక్రమానికి వచ్చిన అనిరుథ్ గురించి పై విధంగా స్పందించింది. ప్రస్తుతం తెలుగులో త్రివిక్రం పవన్ సినిమాకు సైన్ చేసిన అనిరుథ్ ఒకవేళ ఆ సినిమా కనుక చేయకుంటే అతన్ని కిడ్నాప్ చేయిస్తానని అంటుంది. సమంత వార్నింగ్ తో షాక్ తిన్న అనిరుథ్ తను ఈసారి తెలుగు సినిమా చేసేది కన్ఫాం అని చెప్పేశాడు. సో అలా సమంత అనిరుథ్ ల మధ్య సరదా సంభాషణ రెమో ఆడియో రిలీజ్ కార్యక్రమంలో జరిగింది. తెలుగులో రెమో సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. తెలుగులో శివ కార్తికేయన్ సినిమా రిలీజ్ అవడం ఇదే మొదటిసారి.