
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన హనుమాన్ సోషియో ఫ్యాంటసీ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్లతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోవడంతో అందరూ హనుమాన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఇంకా విడుదల కాకమునుపే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందనే కొత్త విషయం బయటకు పొక్కింది. కానీ ప్రశాంత్ వర్మ దానిని ధృవీకరించాల్సి ఉంది.
జనవరి 12న సినిమా విడుదలైన తర్వాత దాని ఫలితాన్ని బట్టి సీక్వెల్ తీయాలా వద్దా అని నిర్ణయించుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక జనవరి 12 తర్వాతే దీని సీక్వెల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హనుమాన్ యావరేజ్‌గా ఆడితే ప్రశాంత్ వర్మ వేరే సినిమా మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హనుమాన్ సినిమాలో వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్, కెమెరా: దాశరధి శివేంద్ర అందిస్తున్నారు.
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం , హిందీ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, చైనీస్, స్పానిష్ భాషలలోను విడుదల చేయబోతున్నారు.