టాకీస్-2 లో ఆమె ఫిక్స్..!

గుంటూర్ టాకీస్ సినిమాతో రష్మి చేసిన రచ్చ అందరికి తెలిసిందే. యాంకర్ గా ఉన్న రష్మికి ఓ రేంజ్ హాట్ ఇమేజ్ తీసుకొచ్చిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వల్ రాబోతుంది. అసలైతే సన్ని లియోన్ ఈ సీక్వల్ లో రష్మి పోశించిన సువర్ణ పాత్ర చేస్తుంది అన్నారు కాని సన్ని చేసేది ఆ రోల్ కాదని అంటున్నారు. ఇక లీడ్ రోల్ గా పవన్ హీరోయిన్ నిఖిషా పటేల్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పులి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిషా ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో కనిపించింది కాని అంత క్రేజ్ దక్కించుకోలేదు. అయితే మరోసారి తెలుగులో తన లక్ చెక్ చేసుకునే ప్రయత్నంలో గుంటూర్ టాకీస్ 2 లో నటిస్తుంది ఈ అమ్మడు. కమర్షియల్ సినిమాల్లోనే రెచ్చిపోయే అందాలతో మతులు పోగొట్టే నిఖిషా ఇక తన మీదే సినిమా అంతా హాట్ హాట్ గా నడుస్తుంది అంటే ఇక ఏ రేంజ్లో రెచ్చిపోతుందో చూడాలి. టాకీస్ నిర్మాతలు తీస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు కాకుండా రాజ్ కిరణ్ డైరెక్ట్ చేయబోతున్నాడట. మొత్తానికి నిఖిషాకు ఇదో లక్కీ ఆఫర్ అని చెప్పొచ్చు.