నెట్‌ఫ్లిక్స్‌లో హై నాన్న... జనవరిలో

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హై నాన్న సినిమా డిసెంబర్‌ 7న థియేటర్లలో విడుదలైంది. హృదయాలని కదిలించే తండ్రీకూతుర్ల సెంటిమెంట్, మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ కలిపి తీసిన హై నాన్న ఫీల్ గుడ్ సినిమాగా టాక్ సంపాదించుకొని మంచి కలక్షన్స్ కూడా రాబడుతోంది. ఈ సినిమాలో నాని కూతురుగా నటించిన కియరా ఖన్నా అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. 

ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రూ.40 కోట్లు చెల్లించి సొంతం చేసుకొంది. జనవరి 4న విడుదల కాబోతోంది.