ఆహా... కోట బొమ్మాళి

ఈ ఏడాది విడుదలైన మంచి చిత్రాలలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కోట బొమ్మాళి పిఎస్ కూడా ఒకటి. రాజకీయ నేపధ్యంతో తీసిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కలక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. సినిమా విడుదలై నెలరోజులు అయినందున ఆహా ఓటీటీలోకి రాబోతోంది. జనవరి 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 

తేజ మార్ణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్‌, ప్రధాన పాత్రలలో నటించారు.

ఈ సినిమాకు సంగీతం: రజనీ రాజ్, కెమెరా: జగదీష్ చీకటి, నిర్మాతలు: బన్నీ వ్యాస్, విద్యా కొప్పినీడి.