కీర్తి సురేశ్ తెలుగులో చాలా సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రజల మనసుల్లో ఆమె ‘మహానటి’గానే నిలిచిపోయారని చెప్పవచ్చు. బహుశః అందుకే ఆమె నుంచి ఆ స్థాయిలో సినిమాలు ఆశిస్తుండం వలననే ఆమె చేస్తున్న సినిమాలు తెలుగు ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె సరైన కధలు ఎంచుకోలేక పోతున్నట్లు అర్దమవుతోంది. అయితే నేటికీ ఆమె తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేసుకుపోతూనే ఉన్నారు.
ఇప్పుడు అగ్ర నటులందరూ వెబ్ సిరీస్ చేస్తుండటంతో ఆమె కూడా ఒకటి పూర్తి చేశారు. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో రాధికా ఆప్టేతో కలిసి చేసిన ఈ వెబ్ సిరీస్కు టైటిల్ ‘అక్క’ అని ఖరారు చేశారు. త్వరలోనే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రాబోతున్నట్లు తెలుస్తోంది.
వెబ్ సిరీస్పై ఎటువంటి సెన్సార్ లేకపోవడంతో చాలా వాటిలో విపరీతమైన రక్తపాతం, అశ్లీల సన్నివేశాలు, బూతులతో నింపేస్తున్నారు. కనుక కీర్తి సురేశ్ చేసిన ఈ వెబ్ సిరీస్లో ఆమె కూడా అందాల ప్రదర్శన, అశ్లీల సన్నివేశాలలో చేశారా లేక హుందాగా చేశారా? అనేది త్వరలో తెలుస్తుంది.