ప్రభాస్‌-మారుతి సినిమా అప్‌డేట్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్నట్లు తెలుసు కానీ దానికి సంబందించి ఎటువంటి సమాచారం ఇంతవరకు బయటకు పొక్కనీయలేదు. తమ సినిమా వలన ప్రభాస్‌ భారీ బడ్జెట్ చిత్రాలు ఆదిపురుష్, సలార్‌ల హైప్ దెబ్బ తినకూడదనే ఉద్దేశ్యంతోనే ఇంతవరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు సలార్ కూడా విడుదలైపోయింది కనుక సంక్రాంతి నుంచి ప్రభాస్‌-మారుతీల సినిమా అప్‌డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.       

ప్రభాస్‌-మారుతీల సినిమా టైటిల్‌ ‘రాజా డీలక్స్’ అని చెప్పుకొంటున్నప్పటికీ అది కాదని తెలుస్తోంది. ఆ సినిమా టైటిల్‌, ఫస్ట్ గ్లిమ్స్‌ రెండూ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల చేయబోతునట్లు తాజా సమాచారం. ఇటీవలే బాలీవుడ్‌ సీనియర్ నటుడు సంజయ్ దత్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో మరో షెడ్యూల్ పూర్తయించి. న్యూఇయర్, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరుసగా పండుగలు ఉన్నందున జనవరి 20 నుంచి తర్వాత షెడ్యూల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.