
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్ జంటగా నటించిన సలార్ సినిమా ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఇప్పుడు సలార్ టీం ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేసింది. సలార్ తీయడానికి టీమ్‌లో ప్రతీ ఒక్కరూ ఎంతగా కష్టపడ్డారో మేకింగ్ వీడియో చూస్తే అర్దమవుతుంది.
సలార్‌లో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, పృధ్వీరాజ్ సుకుమారన్, టీను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్ ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన సంగీతం, భువన్ గౌడ కెమెరాపనితనం సినిమాని మరింత గొప్పగా నిలిపింది.
హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సలార్ విడుదలైన తొలిరోజే రూ.175 కోట్లు వసూలు చేసింది.