ప్రశాంత్
నీల్ దర్శకత్వంలో నిన్న విడుదలైన సలార్ చిత్రం తొలిరోజే కలెక్షన్స్ కనకవర్షం కురిపించింది.
ఈ సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు రూ.90
కోట్లు రాబట్టిన్నట్లు తెలుస్తోంది. అన్నీ కలుపుకొని తొలిరోజు కలెక్షన్స్ రూ.175 కోట్లు
దాటిన్నట్లు తెలుస్తోంది.
సినిమాకు
పాజిటివ్ టాక్ రావడం, ముఖ్యంగా అభిమానులు కోరుకొన్నవిదంగా యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్‌ని చూపడంతో
సినిమాకు హిట్ టాక్ వచ్చింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి రెండు
పెద్ద ఫ్లాప్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు సలార్ చిత్రం గురించి
చాలా ఆందోళన చెందారు. కానీ సినిమా హిట్ అవడంతో వారి ఆనందానికి అంతే లేదు.
ప్రభాస్‌కు
కూడా ఈ సినిమా హిట్ అవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రభాస్ ఇంకా మరికొన్ని భారీ బడ్జెట్
సినిమాలు చేస్తున్నారు కనుక ఆయన మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా హిట్
కాకపోయి ఉంటే తర్వాత విడుదల కాబోతున్న కల్కి ఎడి 2898, స్పిరిట్, రాజా డీలక్స్, దర్శకుడు హనురాఘవపూడితో 2024లో ప్రారంభించబోతున్న మరో భారీ బడ్జెట్ సినిమాలపై ఈ ప్రభావం పడుతుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి
ఎడి 2898 జనవరి 12వ తేదీకి విడుదల కాబోతోంది. ఇది కూడా చాలా బడ్జెట్ సినిమాయే. వైజయంతీ
మూవీస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.
ఈ రెండు
సినిమాల హైప్ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతోనే మారుతి దర్శకత్వంలో తీస్తున్న ‘రాజా డీలక్స్’ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదని సమాచారం. కనుక జనవరిలో కల్కి ఎడి 2898
విడుదలైన తర్వాత దర్శకుడు మారుతి తన ‘రాజా డీలక్స్’తో హడావుడి ప్రారంభించవచ్చు.