సినీ ప్రముఖులు మంత్రిగారిని కలిశారు... ఓ పనైపోయింది!

తెలుగు సినీ ప్రముఖులు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సచివాలయంలో ఆయన కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈరోజు ఆయనను కలిసినవారిలో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, దిల్‌రాజు, సి. కళ్యాణ్, దర్శకులు కె.రాఘవేంద్రరావు తదితరులున్నారు. 

ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ సినీ పరిశ్రమలో ఎవరూ తనకు కనీసం ఫోన్ కూడా చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా అన్నారు. ఆ తర్వాతే దిల్‌రాజు విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన తిరిగి వచ్చిన తర్వాత అందరం కలిసి వచ్చి అభినందనలు తెలియజేయాలనుకొన్నామని సినీ ప్రముఖులు సంజాయిషీ ఇచ్చుకొన్నారు. ఈరోజు వచ్చి మంత్రిగారిని కలిసి అభినందనలు తెలిపారు. మళ్ళీ గురువారం అందరూ కలిసి వచ్చి సిఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తామని చెప్పి సీఎంవో నుంచి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు.