మంచు విష్ణు తాజా చిత్రం కన్నప్ప సినిమాకు హీరోయిన్‌గా మొదట బాలీవుడ్ నటి నుపూర్ సనన్‌ను అనుకొన్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఈ అవకాశం చేజార్చుకొంది. ఆమె స్థానంలో మరో బాలీవుడ్ నటి ప్రీతి ముకుందన్‌ని ఖరారు చేసుకొన్నారు.
గత నెలన్నర రోజులుగా న్యూజిలాండ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా మొత్తం అక్కడే సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేస్తామని దర్శకుడు ముఖేష్ సింగ్, కన్నప్పగా చేస్తున్న మంచు విష్ణు ముందే చెప్పారు. కనుక ప్రీతి ముకుందన్ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు చిత్ర బృందం ట్వీట్ చేసింది. ప్రీతి ముకుందన్ ఇదివరకు తమిళంలో ఒక సినిమా చేసింది కానీ తెలుగులో ఇదే ఆమెకు తొలి సినిమా.
కన్నప్పలో ప్రభాస్ శివుడు పాత్ర చేస్తున్నారు. బ్రహ్మానందం, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్ చేస్తున్నారు.
గతంలో స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మిస్తున్నారు.