కొత్త అత్తని దించుతున్న త్రివిక్రం..!

పవన్ త్రివిక్రం కాంబినేషన్లో సినిమా అంటే అది రిలీజ్ కు ముందే హిట్ అన్న సమీకరణాలు ఉంటాయి. ఎందుకంటే జల్సా, అత్తారింటికి దారేదితో అది నిజమైంది కాబట్టి. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ నే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో చెప్పే త్రివిక్రం ఈ సినిమాలో ఓ కొత్త అత్తను దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. అత్తారింటికి దారేది సినిమాలో అత్తగా చేసిన నదియా ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆమెను చూసి ఉన్నారు కాబట్టి ఈసారి కుష్బుని ట్రై చేస్తున్నారట. తెలుగు సినిమాల్లో నటించడం ఎప్పుడో మానేసిన కుష్బు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ లో చిరు సోదరి పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు త్రివిక్రం, పవన్ సినిమాలో ఓ పాత్రకు ఆమెను అడుగుతున్నారట. కుష్బు కూడా తెలుగు సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 5న స్టార్ట్ అవనున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.