పెళ్లి తర్వాత కూడా..!

దశాబ్ధ కాలంగా సౌత్ సిని ప్రేక్షకులను తన అందంతో అభినయంతో ఆకట్టుకుంటున్న త్రిష ఈ మధ్య తన సినిమాల జోరు పెంచిందని చెప్పాలి. ఆ మధ్య వరుణ్ మణియన్ తో పెళ్లికి సిద్ధమైన అమ్మడు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అయితే పెళ్లి చేసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది త్రిష. రీసెంట్ గా కోలీవుడ్లో రిలీజ్ అయిన కోడి సినిమా త్రిషకు విఫరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది.

ఆ జోష్ లో మీడియా ముందుకొచ్చిన అమ్మడు పెళ్లి ఎలా ఆగిపోయింది అంటే ఇందుకే అన్నది. తన జీవితంలో సినిమాలేకపోతే ఊహించలేనని.. సినిమాల్లో నటిస్తూనే చనిపోవాలని అంటుంది త్రిష. ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన పెళ్లి కూడా తప్పింది సినిమాల వల్లే. నేను ప్రస్తుతం సంతోషంగా ఉన్నా ఒకవేళ పెళ్లి చేసుకున్నా మళ్లీ సినిమాల్లో నటిస్తా కేవలం పిల్లలను కనే సమయంలో తప్ప ఆ తర్వాత యదావిధిగా సినిమాలు చేస్తా అంటుంది త్రిష. 

మరి అమ్మడి కమిట్మెంట్ చూస్తుంటే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి ఒప్పుకునే వరుడినే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఉంది. నాయకిగా ఫ్లాప్ ఫేస్ చేసిన త్రిష ఇప్పుడు కోడి హిట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఇక రీసెంట్ గా తను చేస్తున్న మోహిని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆడియెన్స్ ను అలరించింది. ఆ సినిమా కూడా హిట్ అయితే త్రిషను ఆపడం ఎవరి వల్లా కాదు.