
సూపర్ స్టార్ రజినికాంత్ సౌత్ సూపర్ డైరక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా రోబో 2.0. అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్న ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమా నుండి ఓ హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటి అంటే రోబో 2.0లో ఈసారి రజిని ట్రిపుల్ రోల్స్ లో కనబడబోతున్నాడట.
రోబో సినిమాలో వశికర్, చిట్టిలుగానే అలరించిన రజిని ఈసారి ఏకంగా మూడు పాత్రల్లో ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. హాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ తో ఏమాత్రం రాజి పడకుండా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కచ్చితంగా సౌత్ సినిమాల్లో ఓ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఎమి జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మరి ట్రిపుల్ రోల్ తో వస్తున్న రజిని ఫ్యాన్స్ ను ఏరేంజ్లో సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి. రజిని అనారోగ్యం కారణంగా మిగతా యూనిట్ తో షూటింగ్ నడుపుతున్న రోబో 2.0 సినిమా ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ తో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా బాహుబలిని మించి కలక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు.