
ప్రభాస్ తొలిసారిగా చేసిన పౌరాణిక సినిమా ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశపరచడంతో అభిమానులు దాని తర్వాత వస్తున్న సలార్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ నెల 22న సలార్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కనుక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. సలార్ సెన్సార్ పని పూర్తయిందని చిత్రబృందం స్వయంగా తెలియజేసింది. సినిమాకు సెన్సారు బోర్డ్ ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చిన్నట్లు తెలియజేసింది. కానీ సినిమా రన్ టైమ్ ఎంతో బయటపెట్టలేదు. సుమారు 3 గంటలు ఉందని తెలుస్తోంది. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నందునే ఈ విషయం బయటపెట్టి ఉండకపోవచ్చు.
అయితే సలార్ పూర్తి యాక్షన్ సినిమా. కనుక దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను అంతసేపు థియేటర్లలో కూర్చోబెట్టగలరా లేదా? అనే విషయం డిసెంబర్ 22న సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.
ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, బాలీవుడ్ సీనియర్ నటుడు టిను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: రాష్ట్రవ్యాప్తంగా బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేశారు.
హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ కిరగందూర్ రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సలార్ నిర్మించారు.
Censor done for #SalaarCeaseFire 🔥
Get ready for an intense ‘𝐀’ction drama in cinemas from December 22nd 💥#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @vchalapathi_art @anbariv… pic.twitter.com/GKZ6PHuVny