
మాస్ మహరాజ్ రవితేజ తన సినిమాల స్పీడ్ కాస్త తగ్గించాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాస్ట్ ఇయర్ దీవాళికి బెంగాల్ టైగర్ గా వచ్చిన రవితేజ ఈ సంవత్సరం దీపావళి దాటినా కనీసం సినిమా సెట్స్ మీద కూడా లేకుండా చేసుకున్నాడు. మధ్యలో కొన్ని సినిమాలు ముహుర్తం దాకా వచ్చి కాన్సిల్ అయ్యాయి. దిల్ రాజు బ్యానర్లో ఎవడో ఒకడు సినిమా రవితేజ చేయాల్సింది. అక్కడ నుండి రవితేజకు కష్టాలు మొదలయ్యాయి. వేణు శ్రీరాం రాసుకున్న ఈ కథను రవితేజ ఎలాగు ఎగ్సిట్ అయ్యాడు కాబట్టి నాచురల్ స్టార్ నానితో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.
నాని కూడా కథ విని నచ్చేయడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే లేటు అని అంటున్నారు. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్లో నేను లోకల్ సినిమా చేస్తున్న నాని ఇప్పుడు ఎవడో ఒకడు కూడా ఓకే అంటే వరుసగా దిల్ రాజు బ్యానర్లో కమిట్ అయినట్టే. అబిరుచి గల నిర్మాతకు అంతే అభిరుచి గల హీరో దొరికితే ఎలా ఉంటుందో నాని దిల్ రాజు కాంబినేషన్ అలా ఉంటుంది. నేను లోకల్ అయితే ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేలా చూస్తున్నారు.
ఇక వేణు శ్రీరాం సినిమాకే ముహుర్తం ఎప్పుడు పెడతారో చూడాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని కథ ఎంపికలో కూడా సరైన నిర్ణయాలను తీసుకుంటూ స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యేలా తన సినిమాల ఫలితాలను పొందుతున్నాడు.