
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ హిట్ తో మరింత కష్టాల్లో పడ్డట్టు పరిస్థితులు కనబడుతున్నాయి. కెరియర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ తర్వాత చేయబోయే సినిమా మీద కన్ ఫ్యూజన్ తో ఉన్నాడు తారక్. అందుకే దర్శకులందరితో కథా చర్చలు జరుపుతున్నాడు. అయితే ఎన్.టి.ఆర్ పిలిచి మరి ఆఫర్ ఇస్తానన్నా దాన్ని కాదనేశాడట సురేందర్ రెడ్డి. ఇదవరకు అశోక్, ఊసరవల్లి సినిమాలు ఈ కాంబోలో వచ్చాయి.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ధ్రువ సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి ఆ తర్వాత కన్నడ హీరో నిఖిల్ గౌడతో సినిమా కమిట్ అయ్యాడు. ఈమధ్యనే జాగ్వార్ అంటూ గర్జించిన నిఖిల్ సినిమా టాక్ ఎలా ఉన్నా తనలోని స్పీడ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. కుమారస్వామి తన తనయుడితో మరో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఆ సినిమాకు సురేందర్ రెడ్డి డైరక్టర్ గా దాదాపు కన్ఫాం అయినట్టే.
మరి ఇప్పుడు ఓ కుర్ర హీరో అవకాశం వచ్చింది కదా అని తారక్ ఆఫర్ కాదంటే ఆ తర్వాత సినిమా చేస్తా అని వచ్చి అడిగినా జూనియర్ అవకాశం ఇచ్చే వీలు ఉండదు. నిఖిల్, ఎన్.టి.ఆర్ ల మధ్యలో సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా తీయాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడట. మరి ఫైనల్ గా ఎవరికి మొగ్గుచూపుతాడో చూడాలి.